Skip to main content

Breaking News

[tdnewsticker][label=recent][posts=4]
728

Anthayu Neeve [అంతయు నీవే హరి పుండరీకాక్ష] Annamayya Keerthana Lyrics In Telugu

 Anthayu Neeve [అంతయు నీవే హరి పుండరీకాక్ష] Annamayya Keerthana Lyrics In Telugu 


Anthayu Neeve [అంతయు నీవే హరి పుండరీకాక్ష] Annamayya Keerthana Lyrics In Telugu
Pic Source YouTube 

Annamayya Sankeerthanas Lyrics In Telugu 

Subscribe Our Website & You Will Get All Sankeerthanas Lyrics In Mail మా వెబ్‌సైట్‌ను సబ్‌స్క్రైబ్ చేయండి మరియు మీరు అన్ని సంకీర్తనల సాహిత్యాన్ని మెయిల్‌లో పొందుతారు


Amtayu neevae hari pumdareekaaksha (అంతయు నీవే హరి పుండరీకాక్ష) Keerthana Basic Credits:
KeerthanaAmtayu neevae hari pumdareekaaksha
Sung ByGarimella Bala Krishna Prasad
LanguageTelugu (తెలుగు)
MusicGarimella Bala Krishna Prasad
Keerthana No 385Volume No. 1 Copper Sheet No. 80
Music LabelAditya Music



మాటలు - మూటలు

పెద్దలమాట సద్ది మూట మనస్సును అంతర్ముఖం చేసి, అందే నిలిపితే కలిగేది సంతోషం! ఆ మనస్సుని బయటకు పంపితే కలిగేది దుఃఖం! ఉన్నది సుఖమే! సుఖం లేదు అనే భావనయే దుఃఖం! ఆనందమే మనిషి యొక్క స్వభావం!  శ్రీ రమణ మహర్షి.

     మంచిమాట మానవ జీవిత లక్షాన్ని సాధించడానికి మొదటిగా మర్యాద గల మాటతీరు ఎంతైనా అవసరం. సంస్కారవంతమైన మాటతీరు హృదయ సామ్రాజ్యాన్ని గెలుచుకుంటుంది



Amtayu neevae hari pumdareekaaksha Keerthana Lyrics 

Pallavi: Amtayu neevae hari pumdareekaaksha (అంతయు నీవే హరి పుండరీకాక్ష)

Keerthana No. 385; 

Volume No. 1

Copper Sheet No. 80

Ragam: Padi

Language: Telugu (తెలుగు)

Sung By : Garimella Bala Krishna Prasad 


పాడిన వారు

 గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్


 పల్లవి 

అంతయు నీవే హరి పుండరీకాక్ష 

చెంత నాకు నీవే శ్రీరఘురామ


చరణం :1: 


కులమును నీవే గోవిందుడా 

నా కలిమియు నీవే కరుణానిధి 

తలపును నీవే ధరణీధర 

నా నెలవును నీవే నీరజనాభ


 చరణం :2: 


తనువును నీవే దామోదర 

నా మనికియు నీవే మధుసూదన 

వినికియు నీవే విట్ఠలుడా 

నా వెనకముందు నీవే విష్ణు దేవుడా



చరణం :3: 


పుట్టుగు నీవే పురుషోత్తమ 

కొన నట్టనడుము నీవే నారాయణ 

ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా 

నాకు నెట్టన గతి ఇంక నీవే నీవే


Podupu Kathalu in Telugu

తెలుగు పొడుపు కథలు


What Are Podupu Kathalu?

Podupu Kathalu are small trickey questions asked for the sake of fun, podupu kathalu are called as riddles in English.


తెలుగు పొడుపు కథలు

కాలక్షేపం కోసం అడిగే చిన్న చిక్కు ప్రశ్నలను పొడుపు కథలు అంటారు.


పొడుపు కథ (1) : చిన్న పాపకు చాలా చీరలు. ఏమిటది?

సమాధానం :  ?


పొడుపు కథ (2) :  జాన కాని జాన, ఏమి జాన?

సమాధానం :  ?

సమాధానాలు క్రింద ఉన్నాయి


Anthayu Neeve [అంతయు నీవే హరి పుండరీకాక్ష] Annamayya Keerthana Online Video Song Credit Goes To YouTube

Annamayya Keerthana Online Video Song


Music Label Credit Goes To ADITHYA MUSIC


Disclaimer : If you found any mistakes in keerthana – please kindly excuse me and wrote exact correct keerthana lyrics in comments section. We will correct it and publish immediately  in our website.


అన్నమయ్య



అన్నమయ్య లేదా తాళ్ళపాక అన్నమాచార్యులు

అన్నమయ్య లేదా తాళ్ళపాక అన్నమాచార్యులు (మే 9, 1408 - ఫిబ్రవరి 23, 1503) తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు (సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు). అన్నమయ్యకు పదకవితా పితామహుడు అని బిరుదు ఉంది. దక్షిణాపథంలో భజన సంప్రదాయానికి, పదకవితాశైలికి ఆద్యుడు. గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ని, అహోబిలము లోని నరసింహ స్వామి ని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32వేలకు పైగా కీర్తనలు రచించాడు . అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యం పెనవేసికొని ఉంటాయి ఇంకాతెలుసుకోవడానికి. క్లిక్ చేయండి .

Google Courtesy 

Annamacharya Keerthana Lyrics In English Font Refer

https://annamayyakeerthana.blogspot.com


పొడుపు కథల సమాధానాలు

1) ఉల్లిపాయ

2) ఖజాన


PLEASE SHARE AND COMMENT

Post a Comment

0 Comments

728